PAK vs SL | కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. ఓవర్నైట్ స్కోరు 178/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ ఆట ముగిసే సమయానికి 563/5 స్కోరు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు.
లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అబ్దుల్లా తన కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేసుకున్నాడు. అగా సల్మాన్ (132)సెంచరీ కొట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న పాక్ ప్రస్తుతం 397 ఆధిక్యంలో కొనసాగుతున్నది. లంక తొలి ఇన్నింగ్స్లో 166 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.