హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అనుభవజ్ఞులైన ఐవరీకోస్ట్ మిడ్‌ఫీల్డర్ ఇబ్రహిం సిస్కో, డిఫెండర్ సాజిద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న ఐలీగ్ కోసం సన్నద్ధమవుతున్న ఎస్‌డీఎఫ్‌సీ అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది.
ఐవరీకోస్ట్ తరఫున అండర్-20టోర్నీల్లో ఆడిన అనుభవమున్న సిస్కో మిడ్‌ఫీల్డర్‌గా జట్టుకు సేవలందించనున్నాడు.