నాదల్ నిష్క్రమణ
రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్కు చుక్కెదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే నాదల్ ఓడిపోయాడు. గత యేడాది టైటిల్ విజేత, టాప్ సీడ్ అయిన నాదల్ ఎడమ తుంటి నొప్పితో బాధపడుతూ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో వరుస సెట్లలో 6-4,6-4,7-5తో ఓడిపోయాడు. కా
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్ : రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్కు చుక్కెదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే నాదల్ ఓడిపోయాడు. గత యేడాది టైటిల్ విజేత, టాప్ సీడ్ అయిన నాదల్ ఎడమ తుంటి నొప్పితో బాధపడుతూ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో వరుస సెట్లలో 6-4,6-4,7-5తో ఓడిపోయాడు. కాగా పురుషుల విభాగంలో సీడెడ్లు స్టెఫనాస్ త్సిత్సిపాస్(3), అగర్ అలిసియామి(6), డేనియల్ మెద్వెదెవ్(7), హ్యూబర్ట్ హర్కజ్, కామెరూన్ నోరి(11), జాన్ సిన్నర్(15), మహిళల విభాగంలో టాస్ సీడ్ ఇగా స్వియాటెక్, జెస్సిక పెగ్యుల(3), మారియా సక్కారి(6), కొకొ గాఫ్(7), మాడిసన్ కీస్(10), డేనియల్ కొలిన్స్(13), పెట్రా క్విటోవా(15) ముందంజ వేయగా, మహిళల్లో దారియా కసట్కిన(8), బీట్రిజ్ హదద్ మయా(14) ఇంటిదారి పట్టారు.
పురుషుల్లో సిట్సిపాస్ 6-3, 6-0, 6-2తో రింకి హిజికతపై, అలిసియామి 3-6,3-6,6-3,6-2,6-2తో అలెక్స్ మోయికాన్పై, మెద్వెదెవ్ 7-5, 6-2, 6-2తో జాన్ మిల్మన్పై, హర్కజ్ 3-6, 7-6(7-3), 2-6, 6-3,6-3తో లొరెంజొ సొనెగొపై, కామెరూన్ నోరి 6-3,3-6, 7-6(2),6-3తో కాన్స్టాంట్ లెస్టీన్నెపై గెలుపొందారు. మహిళల్లో టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ 6-2, 6-3తో ఒసారియో సెరానొపై, జెస్సిక పెగ్యుల 6-2,7-6(5)తో అలిగ్జాండ్రా సస్నోవిచ్పై, మారియా సక్కారి 3-6,7-5,6-3తో డయానా ష్నైడర్‌పై, కొకో గాఫ్ 6-3,7-6(4)తో ఎమ్మా రదుకానుపై, మాడిసన్ కీస్ 6-3,6-2తో వాంగ్ జిన్యుపై గెలుపొందారు. కాగా దారియా కసట్కిన 1-6,1-6తో వర్వర గ్రచేవ చేతిలో, బీట్రిజ్ మదద్ మైయా 6-7(11), 2-6తో నూరియా పరిజాస్ డయాజ్ చేతిలో, పెట్రా క్విటోవా 5-7,4-6తో అన్హలిన కలినిన చేతిలో ఓడిపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

