Spain Football Chief | ముదురుతున్న ముద్దు వివాదం.. న్యాయ పోరాటానికి సిద్ధమైన ఫుట్‌బాల్ సమాఖ్య
Spain Football Chief : స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ముద్దు వివాదం(Kiss Incident) రోజుకో మలుపు తిరుగుతోంది. ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ రూబియేల్స్(Luis Rubiales,) తన అంగీకారం లేకుండానే ముద్దు పెట్టుకున్నాడని మిడ్ ఫీల్డర్ జెన్నిహెర్మొసో(Jenni Hermoso) ఆరోపించింది. దాంతో, సమాఖ్య ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు రూబియేల్స్కు సంపూర్ణ మద్దుతు ప్రకటించింది. అతడిపై వస్తున్న ఆరోపణలను....
Spain Football Chief : స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ముద్దు వివాదం(Kiss Incident) రోజుకో మలుపు తిరుగుతోంది. ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ రూబియేల్స్(Luis Rubiales,) తన అంగీకారం లేకుండానే ముద్దు పెట్టుకున్నాడని మిడ్ ఫీల్డర్ జెన్నిహెర్మొసో(Jenni Hermoso) ఆరోపించింది. దాంతో, సమాఖ్య ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు రూబియేల్స్కు సంపూర్ణ మద్దుతు ప్రకటించింది. అతడిపై వస్తున్న ఆరోపణలను న్యాయ పరంగా ఎదుర్కొంటామని తెలిపింది. అంతేకాదు ‘రూబియెల్స్పై జెన్నిహెర్మొసో, ఆమె క్యాంప్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడతామని చెప్పింది. వాళ్లు చెప్తున్న ప్రతి అబద్ధం, వాళ్లు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల్ని కోర్టుకు విన్నవిస్తా’మని ఫెడరేషన్ సమాఖ్య ప్రకటించింది.
వరల్డ్ కప్ ఫైనల్లో(FIFA World Cup 2023) ఇంగ్లండ్‌పై గెలుపొందిన స్పెయిన్ మహిళల జట్టు మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత విజేతలకు మెడల్ ప్రదానం చేస్తున్న సమయంలో లూయిస్, జెన్నీని అభినందించి, పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన ప్రజలు కోపంతో ఊగిపోయారు. లూయిస్‌పై భారీగా వ్యతిరేకత రావడంతో ఆ దేశ ఉప ప్రధాని అతడిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాడు. అయితే.. పరస్పర అంగీకారంతోనే ముద్దు పెట్టుకోవడం జరిగిందిని చెప్పిన రూబియేల్స్ మొదట సారీకి నిరాకరించాడు. అయితే.. ప్రజలు, ఫుట్‌బాల్ దిగ్గజాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సారీ చెప్పాడు. కానీ, రాజీనామా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు.
ఇవి కూడా చదవండి
Henry Olonga | బహిరంగ క్షమాపణ చెప్పిన జింబాబ్వే దిగ్గజం.. కారణం అదే..!
Run Out: రనౌటైన ఆవేశంలో బ్యాట్‌ను విసిరేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

