Run Out: రనౌటైన ఆవేశంలో బ్యాట్‌ను విసిరేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వీడియో
Run Out: రనౌట్ అయిన ఆవేశంలో నాన్ స్ట్రయికర్ తన బ్యాట్‌ను గాలిలోకి విసిరేశాడు. అయితే ఆ బ్యాట్ వెళ్లి నేరుగా స్ట్రయికర్ను తాకింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
హైదరాబాద్: క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని గమ్మత్తు ఘటనలు జరుగుతుంటాయి. ఓ క్రికెటర రనౌట్ అయిన తర్వాత ఆవేశంలో బ్యాట్‌ను విసిరేశాడు. అయితే ఆ బ్యాట్ కాస్త.. గాలిలో ఎగురుతూ స్ట్రయికింగ్ చేస్తున్న బ్యాటర్‌ను బలంగా తాకింది. ఈ ఘటన ఓ అమెచ్యూర్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆ వీడియో ఎంత క్రెడిబుల్ అన్న విషయం పక్కన పెడితే, ఔటైన రన్నర్ ఎంత ఆక్రోశంతో ఉన్నాడో అర్థం అవుతుంది.
https://twitter.com/MovieNCricEdits/status/1695087895772860531?s=20
నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం ప్రయత్నం చేశాడు. కానీ షాట్ కొట్టిన బ్యాటర్ మాత్రం రెండు అడుగులు వేసి మళ్లీ వెనక్కి వెళ్లాడు. ఇక మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్.. బంతిని నేరుగా నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను కొట్టేశాడు. దీంతో రనౌట్ అయిన ఆ బ్యాటర్ క్రీజ్ నుంచి వెళ్లిపోతే ఆవేశంతో తన చేతుల్లో ఉన్న బ్యాట్‌ను విసిరేశాడు. ఆ బ్యాట్ గింగిరాలు తిరుగుతూ.. స్ట్రయింగ్ వద్ద ఉన్న బ్యాటర్‌కు బలంగా తగిలింది. ఓ వైపు ఈ ఫన్నీ ఘటన జరుగుతున్న సమయంలోనే.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు వికెట్ తీసిన సంబరాలను ఎంజాయ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Batter
- non striker
- runout
- striker
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

