Henry Olonga | బహిరంగ క్షమాపణ చెప్పిన జింబాబ్వే దిగ్గజం.. కారణం అదే..!
Henry Olonga : జింబాబ్వే లెజెండరీ పేసర్ హెన్రీ ఓలంగా(Henry Olonga) బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(Heath Streak) మరణించినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అందరూ తనను మన్నించాలని కోరాడు. స్ట్రీక్ కుటుంబ సభ్యులకు మరీ మరీ సారీ చెప్పాడు. 'ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్తున్నా....
Henry Olonga : జింబాబ్వే లెజెండరీ పేసర్ హెన్రీ ఓలంగా(Henry Olonga) బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(Heath Streak) మరణించినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అందరూ తనను మన్నించాలని కోరాడు. స్ట్రీక్ కుటుంబ సభ్యులకు మరీ మరీ సారీ చెప్పాడు. ‘ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్ట్ చూసిన స్ట్రీక్ వెంటనే దాన్ని తీసెయ్’ అని నాకు మెసేజ్ చేశాడు. అతడు చెప్పినట్టే చేశాను అని ఈ దిగ్గజం వెల్లడించాడు. అంతేకాదు తాను ఎందుకు ఆ పోస్ట్ పెట్టాల్సి వచ్చిందో వివరించాడు.
‘ఈ ఏడాది ఆరంభంలో హీత్ ఆరోగ్యం బాగా లేదనే విషయం తెలిసింది. దాంతో, అతడి కాంటాక్ట్ అయ్యాను. హీత్ తనకు ట్రీట్మెంట్ జరుగుతున్న తీరు వంటి విషయాలు నాతో పంచుకున్నాడు. అయితే.. ఆరోగ్యం క్షీణించడంతో అతను మరణించాడని ఫేస్బుక్ పోస్ట్‌లో చూశాను. అది నిజమా? అబద్ధమా? తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులను సంప్రతించాను. కానీ, ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో, హీత్ స్ట్రీక్ చనిపోయాడని నమ్మాను. అందుకనే సంతాపం తెలియజేస్తూ ఆ పోస్ట్ పెట్టాను’ అని ఒలంగా తెలిపాడు.
నాలుగు రోజుల క్రితం హీత్ స్ట్రీక్ చనిపోయాడంటూ ఒలంగా పోస్ట్ పె ట్టిన విషయం తెలిసిందే. దాంతో, ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు సంతాపం తెలియాజేశారు. అయితే.. ఆ మరునాడే నేను బతికే ఉన్నాను. నా మరణ వార్త గురించిన విషయాలన్నీ అబద్ధాలే అంటూ స్ట్రీక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు వెంటనే ఆ పోస్ట్ తొలగించాలని ఒలంగాను కోరాడు. తన ఫ్రెండ్ చెప్పినట్టే ఒలంగా దానిని డిలీట్ చేశాడు.
హెన్రీ ఓలంగా, హీత్ స్ట్రీక్

ఒలంగా, స్ట్రీక్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 1984లో మొదటిసారి వీళ్లు ప్రైమరీ స్కూల్లో కలుసుకున్నారు. హీత్ ఆటల్లో ఫస్ట్ ఉండేవాడు. రబ్బీ, క్రికెట్, టెన్నిస్, సాకర్‌తో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణించేవాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జింబాబ్వే జాతీయ జట్టుకు ఆడారు. తమ పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఆటకు వీడ్కోలు పలికినా కూడా ఇప్పటికీ వీళ్ల స్నేహం కొనసాగుతూనే ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

