Spain Football Cheif | వరల్డ్ కప్ విజేతకు ముద్దుపై వివాదం.. క్షమాపణ చెప్పిన స్పెయిన్ ఫుట్‌బాల్ చీఫ్
Spain Football Cheif : స్పెయిన్ ఫుట్‌బాల్ చీఫ్ లూయిస్ రుబియేల్స్(Luis Rubiales) వరల్డ్ కప్ విజేత(World Cup Winner)కు క్షమాపణలు చెప్పాడు. జెన్నీ హెర్మొసో(Jenni Hermoso)కు ముద్దు పెట్టడంపై వివాదం చెలరేగడంతో అతను సారీ చెప్పక తప్పలేదు. స్పెయిన్ మహిళల జట్టు ఫైనల్లో గెలవగానే మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ సమయంలోనే లూయిస్, జెన్నీకి...
Spain Football Cheif : స్పెయిన్ ఫుట్‌బాల్ చీఫ్ లూయిస్ రుబియేల్స్(Luis Rubiales) వరల్డ్ కప్ విజేత(World Cup Winner)కు క్షమాపణలు చెప్పాడు. జెన్నీ హెర్మొసో(Jenni Hermoso)కు ముద్దు పెట్టడంపై వివాదం చెలరేగడంతో అతను సారీ చెప్పక తప్పలేదు. స్పెయిన్ మహిళల జట్టు ఫైనల్లో గెలవగానే మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ సమయంలోనే లూయిస్, జెన్నీకి పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రజలు కోపంతో ఊగిపోయారు. లూయిస్‌పై భారీగా వ్యతిరేకత రావడంతో ఆ దేశ ఉప ప్రధాని అతడిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాడు.
ఈ నేపథ్యంలో లూయిస్ తన తప్పు ఒప్పుకొని జెన్నీకి సారీ చెప్పాడు. ‘నేను కచ్చితంగా పొరపాటు చేశాను. నేను ఒప్పుకుంటున్నా. అయితే.. చెడు ఆలోచనతో నేను ఆమెకు ముద్దు పెట్టలేదు. పట్టలేనంత సంతోషంలో ఉన్న ఆ క్షణంలో పరస్పర అంగీకారంతోనే అది జరిగింది’ అని ఓ లెటర్ విడుదల చేశాడు. కానీ, అతను ఉద్దేశ పూర్వకంగానే మరికొందరితోనూ అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. మహిళా ప్లేయర్ల చెంపలపై ముద్దులు పెట్టడమే కాకుండా అవార్డు ప్రదాన సమయలోనూ లూయిస్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడని కొందరు ఆరోపిస్తున్నారు.
ఫైనల్లో గెలిచాక సంబురాల్లో స్పెయిన్ మహిళల జట్టు

ఆదివారం ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA Women’s World Cup) ఫైనల్లో స్పెయిన్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి అర్ధ భాగంలో కెప్టెన్ ఒల్గా కార్మోనా(Olga Carmona) గోల్ కొట్టింది. దాంతో, ఇంగ్లండ్‌పై 1-0తో గెలిచిన స్పెయిన్ ట్రోఫీని అందుకుంది. ప్రపంచ కప్‌తో స్వదేశానికి వెళ్లిన స్పెయిన్ జట్టుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. వీళ్ల విజయాన్ని ప్రజలు పెద్ద పండుగలా చేసుకున్నారు. బాణాసంచా పేల్చి, డీజేలు పెట్టి ఉత్సాహంగా ఆడిపాడారు.
ఇవి కూడా చదవండి
Joe Root | ఇంగ్లండ్ అత్యుత్తమ క్రికెటర్ అతనే.. స్టోక్స్‌ను ఆకాశానికెత్తేసిన జో రూట్
John Cena | వచ్చే నెలలో హైదరాబాద్‌కు రెజ్లింగ్ దిగ్గజం.. భారత గడ్డపై అతడికిదే తొలి బౌట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

