FIFA World Cup: ముగిసిన రోనాల్డో కెరీర్.. పోర్చుగల్‌పై విక్టరీతో క్వార్టర్స్‌లోకి స్పెయిన్
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ పోరాటం ముగిసింది. రౌండ్16 మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో నెగ్గింది. దీంతో సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. శుక్రవారం కాలిఫోర్నియాలో బెల్జియంతో స్పెయిన్ తలపడనున్నది.
టెక్సాస్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup) నుంచి పోర్చుగల్ ఔటైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఓడిపోయింది. స్టాపేజ్ టైంలో స్పెయిన్ ప్లేయర్ మైఖేల్ మెరినో 91వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఫెర్రన్ టోరస్ నుంచి పాస్ అందుకున్న మెరినో.. పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టాను బీట్ చేసి గోల్ చేశాడు. పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో తమ జట్టును ఆదుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతని పోరాటం ఫలించలేదు. దీంతో ప్రపంచకప్‌లో రోనాల్డో కెరీర్ ముగిసిపోయింది. ఇదే తనకు చివరి వరల్డ్‌కప్ అని రోనాల్డో ప్రకటించిన విషయం తెలిసిందే. 2010 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారి మళ్లీ క్వార్టర్స్ దశలోకి స్పెయిన్ ప్రవేశించింది. ఇక శుక్రవారం కాలిఫోర్నియాలో జరిగే క్వార్టర్స్‌లో ఆ జట్టు బెల్జియంతో తలపడనున్నది.
ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. కానీ ఒక్క జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. స్పెయిన్ తరపున మైఖేల్ ఒయర్జబాల్ .. ప్రత్యర్థి గోల్ పోస్టుపై మెరుపు దాడులు చేశాడు. కానీ గోల్స్ రాలేకపోయాయి. ఇక పోర్చుగల్ తరపున క్రిస్టియానో రోనాల్డో కూడా దూకుడుగా ఆడాడు. స్పెయిన్ గోల్ పోస్టుపై అటాక్ చేశారు. కానీ అతను కూడా సక్సెస్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో రెండు జట్లు జాగ్రత్తగా ఆడాయి. కానీ ఎక్స్ట్రా టైంలో వచ్చిన ఇద్దరు సబ్స్టిట్యూట్లు.. స్పెయిన్‌కు విజయాన్ని అదించారు. ఫెర్రన్ టోరెస్, మెరినో కలిసి గోల్ చేశారు.
మ్యాచ్‌కు ముందే ఇదే తన చివరి వరల్డ్‌కప్ అని క్రిస్టియానో రోనాల్డో పేర్కొన్న విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ ఓటమితో రోనాల్డో అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. 41 ఏళ్ల రోనాల్డో.. ప్రపంచకప్ పోటీల్లో 27 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్ చేశాడు. కానీ వరుసగా ఆరు వరల్డ్‌కప్స్‌లో గోల్స్ చేసి కొత్త రికార్డును స్థాపించాడు. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం అతను అత్యధికంగా 146 గోల్స్ చేశాడు. ఈ టోర్నమెంట్లో రోనాల్డో మూడు గోల్స్ చేశాడు. కానీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సిమన్ గీతను దాటలేకపోయాడు. ఈ టోర్నీలో సిమన్ ఇప్పటి వరకు ఒక్క గోల్ కూడా ప్రత్యర్థులకు ఇవ్వలేదు. ఈ టోర్నీలో 609 నిమిషాల పాటు గోల్ కీపింగ్ చేసిన సిమన్.. ఇప్పటి వరకు ఒక్క గోల్ కూడా అతను సమర్పించలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

