FIFA World Cup | ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ సంచలనం.. ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్లోకి..!
FIFA World Cup | ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup-2026)' లో స్పెయిన్ (Spain) సంచలనం సృష్టించింది. టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ (France) కు షాకిచ్చి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టెక్సాస్ (Texas) లోని ఏటీ & టీ స్టేడియంలో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది.
FIFA World Cup : ‘ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup-2026)’ లో స్పెయిన్ (Spain) సంచలనం సృష్టించింది. టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ (France) కు షాకిచ్చి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టెక్సాస్ (Texas) లోని ఏటీ & టీ స్టేడియంలో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది. 2010లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత స్పెయిన్ మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్ (World Cup Final) కు అర్హత సాధించడం ఇదే తొలిసారి.
మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ పట్టు బిగించింది. ఆట 22వ నిమిషంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నే ఫౌల్ చేయడంతో రిఫరీ పెనాల్టీని కేటాయించారు. ఈ అవకాశాన్ని మికెల్ ఒయర్జాబల్ గోల్‌గా మలచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కూడా స్పెయిన్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 58వ నిమిషంలో మరో గోల్ సాధించింది. డానీ ఓల్మోతో కలిసి అద్భుతమైన పాస్‌లు మార్చుకున్న పెడ్రో పోరో, గోల్ కీపర్ మైక్‌ను దాటుకుంటూ బంతిని నెట్లోకి పంపి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపే సహా ఇతర అటాకింగ్ ప్లేయర్లు పూర్తిగా తేలిపోయారు. స్పెయిన్ పటిష్ఠమైన డిఫెన్స్ వారిని పూర్తిగా కట్టడి చేసింది. దాంతో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశాలను కూడా సృష్టించుకోలేకపోయింది. వరుసగా మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరాలన్న ఫ్రాన్స్ ఆశలకు ఈ ఓటమితో తెరపడింది. 14 ఏళ్లుగా కోచ్‌గా ఉన్న డిడియర్ డెషాంప్స్కు ఇది చేదు వీడ్కోలుగా మిగిలింది.
తాజా విజయంతో 2010 నాటి స్వర్ణయుగాన్ని స్పెయిన్ గుర్తుకు తెచ్చింది. తమ జట్టు సమష్టిగా రాణించిందని, ముఖ్యంగా ఫ్రాన్స్ బలాలను అడ్డుకోవడంలో సఫలమయ్యామని స్పెయిన్ మేనేజర్ లూయిస్ డి లా ఫ్యూయెంటె ప్రశంసించాడు. ఆదివారం న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్లో అర్జెంటీనా-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో స్పెయిన్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

