స్పెయిన్‌కు బెల్జియం సవాల్.. నేడు కీలక క్వార్టర్ ఫైనల్
ఫిఫా ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. అమెరికాపై ఘన విజయం సాధించిన జోష్‌లో ఉన్న బెల్జియం.. శుక్రవారం అర్ధరాత్రి జరిగే క్వార్టర్స్‌లో అజేయంగా దూసుకుపోతున్న బలమైన స్పెయిన్‌తో తలపడనుంది.
- అ.రా. 12.30 నుంచి
కార్సన్ (యూఎస్ఏ): ఫిఫా ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. అమెరికాపై ఘన విజయం సాధించిన జోష్‌లో ఉన్న బెల్జియం.. శుక్రవారం అర్ధరాత్రి జరిగే క్వార్టర్స్‌లో అజేయంగా దూసుకుపోతున్న బలమైన స్పెయిన్‌తో తలపడనుంది. ప్రిక్వార్టర్స్‌లో అమెరికాను 4-1 తేడాతో చిత్తు చేసిన బెల్జియం అదే ఊపును కొనసాగించి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా.. అజేయంగా నిలిచిన స్పెయిన్ కూడా టైటిల్ దిశగా ముందజ వేయాలని డిసైడైంది.
అయితే గతపోరులో అమెరికాను ఓడించిన తర్వాత బెల్జియం ప్లేయర్లు గ్రౌండ్లో, డ్రెస్సింగ్ రూమ్‌లో యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకరించేలా సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్‌లోని లొయోలా మేరీమౌంట్ యూనివర్సిటీలో తమకు కేటాయించిన శిక్షణా మైదానాలు కనీస ప్రమాణాలకు అనుగుణంగా లేవని బెల్జియం ఫుట్‌బాల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఫిఫా అనుమతితో బుధవారం తమ ప్రాక్టీస్ వేదికను లాస్ ఏంజెల్స్ గెలాక్సీ స్టేడియానికి మార్చుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

