చెన్నై: టీమ్ఇండియా పేసర్ బుమ్రాపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డివిలీయర్స్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన ద్వారా మిగతా భారత బౌలర్లను బుమ్రా దాటేశాడని డివిలీయర్స్ పేర్కొన్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకోవడంపై ఏబీ స్పందిస్తూ ‘బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.
వాట్ ఏ బౌలర్! స్వింగ్ నైపుణ్యంతో మిగతా భారత బౌలర్లను అతను అధిగమించాడు. బుమ్రా అమ్ములపొదిలో యార్కర్ ప్రధాన అస్త్రం. యార్కర్లతో అతను ఇప్పటి వరకు టెస్టుల్లో చాలా వికెట్లు తీశాడు. గిల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తాచూపించాడు’ అని అన్నాడు.