సిడ్నీ: పాకిస్థాన్ విసిరిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. కడపటి వార్తలు అందేసరికి సౌతాఫ్రికా 8 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 67 రన్స్ చేసింది. పవర్‌ప్లేలో సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 48 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ డీకాక్ డకౌట్ కాగా, రూసో ఏడు రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే పవర్ ప్లే తర్వాత ఓపెనర్ బవుమా, మార్క్రమ్ కూడా ఔటయ్యారు. బవుమా 19 బంతుల్లో 36 రన్స్ చేసి నిష్క్రమించాడు.
అంతకుముందు ఇఫ్తికర్ అహ్మద్(51), షాదాబ్ ఖాన్(52) హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో.. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. ఆరో వికెట్‌కు ఇఫ్తికర్, షాదాబ్‌లు కీలకమైన 82 రన్స్ జోడించారు. లోయర్ మిడిల్ ఆర్డర్లో ఇఫ్తికర్, షాదాబ్‌లు ధీటుగా బ్యాటింగ్ చేశారు. సౌతాఫ్రికా పేస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇఫ్తికర్ 51, షాదాబ్ 52 రన్స్ చేసి ఔటయ్యారు.