Dale Steyn: క్రికెట్‌కు సౌతాఫ్రికా లెజెండరీ బౌలర్ గుడ్‌బై
సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్( Dale Steyn ) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్‌బౌలర్ క్రికెట్లోని వేగవంతమైన బౌలర్లలో ఒకడు.

కేప్‌టౌన్: సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్( Dale Steyn ) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ట్విటర్ ద్వారా ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్‌బౌలర్ క్రికెట్లోని వేగవంతమైన బౌలర్లలో ఒకడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు ఆడిన స్టెయిన్.. 439 వికెట్లు తీశాడు. తన రిటైర్మెంటన్ ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేశాడు. తనకెంతో ఇష్టమైన గేమ్ నుంచి ఇవాళ రిటైరవుతున్నట్లు చెప్పాడు. 20 ఏళ్ల పాటు ట్రైనింగ్, ప్రయాణాలు, గెలుపులు, ఓటములు అంటూ తీరక లేకుండా గడిపానని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తన ప్రటనలో స్టెయిన్ అన్నాడు.
2019, ఫిబ్రవరిలో చివరి టెస్ట్ ఆడిన స్టెయిన్.. అదే ఏడాది ఆగస్ట్‌లో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఇక చివరి వన్డేను 2019 మార్చిలో, చివరి టీ20ని గతేడాది ఫిబ్రవరిలో ఆడాడు. గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఆడిన స్టెయిన్.. కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఆడలేదు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన స్టెయిన్.. 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు.
Announcement. pic.twitter.com/ZvOoeFkp8w
— Dale Steyn (@DaleSteyn62) August 31, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

