ICC Rankings | దుబాయ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటలేకపోయారు.
వరుణుడి దోబూచులాటతో బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లంతా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మందన 6వ స్థానంలో నిలువగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 8వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ అగ్రస్థానం దక్కించుకుంది.