Smrithi Mandhana | పింక్ బాల్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా
ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా( Smrithi Mandhana ) చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది.

క్వీన్స్‌ల్యాండ్: ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా( Smrithi Mandhana ) చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భారత మహిళల జట్టు తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచరీ చేసేలా కనిపించినా.. వర్షం అడ్డుపడటంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో ఆమె 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగించిన ఆమె.. ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ మార్క్ అందుకుంది.
ఆమె సెంచరీలో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఆమె కొన్ని కళ్లు చెదిరే ఆఫ్‌సైడ్ షాట్లతో అలరించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గత మూడు నెలలుగా తాను పింక్ బాల్‌ను దగ్గర పెట్టుకొని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తొలి రోజు ఆట తర్వాత మందాన చెప్పింది. అందుకే తాను ఆ బంతికి అలవాటు పడినట్లు ఆమె తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

