పార్ల్: టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తనకు సూపర్‌హీరో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పో్స్టు చేశాడు. కింగ్ కోహ్లీనే ఎప్పటికీ తన కెప్టెన్ అన్న అభిప్రాయాన్ని కూడా సిరాజ్ వ్యక్తం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియా 1-2 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ స్పందిస్తూ.. కోహ్లీ తన సామర్థ్యంపై పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్స్ తెలిపాడు. నువ్వే నా సూపర్‌హీరో అని, నీ నుంచి నాకు ఎంతో సపోర్ట్ వచ్చిందని, దానికి సర్వదా కృతజ్ఞుడినని, తననెప్పుడూ ఓ సోదరుడిగా చూశాడని సిరాజ్ తన పోస్టులో తెలిపాడు. కోహ్లీ నాయకత్వంలోనే సిరాజ్ తన టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో ఆడే బెంగుళూరు జట్టుకు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోహ్లీ సారథ్యంలో 8 టెస్టులు ఆడిన సిరాజ్.. 27.04 సగటుతో 23 వికెట్లు తీసుకున్నాడు. ఇక బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం అయ్యే వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ, సిరాజ్‌లు ఆడనున్నారు.