బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్ గ్రామానికి చెందిన చల్లా సిద్దార్థరెడ్డి ఐస్‌స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. 2024 జనవరి 19 నుంచి 21 వరకు ఫిన్లాండ్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీకి భారత జట్టులో పాల్గొనే అవకాశం దక్కడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు సాధించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజునే ఎంపిక కావడం అదృష్టంగా ఉందని సిద్దార్థ్‌రెడ్డి తండ్రి రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.