ICC Rankings: నెంబర్ వన్ బ్యాటర్ గిల్.. నెంబర్ వన్ బౌలర్ సిరాజ్
ICC rankings: ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. బ్యాటింగ్‌లో గిల్, బౌలింగ్‌లో సిరాజ్.. నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బాబర్‌ను వెనక్కి నెట్టేసి.. గిల్ తొలి స్థానం చేజిక్కించుకున్నాడు. రెండు పాయింట్లు ఎగబాకిన సిరాజ్.. బౌలింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ముంబై: ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్, బౌలర్ మహమ్మద్ సిరాజ్‌లు.. ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో టాప్ ప్లేస్ కొట్టేశారు. బ్యాటింగ్‌లో గిల్, బౌలింగ్‌లో సిరాజ్‌లు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా ఐసీసీ తన ర్యాంకుల జాబితాను రిలీజ్ చేసింది. చాన్నాళ్లుగా బ్యాటింగ్‌లో టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్ ర్యాంకు పడిపోయింది. బాబర్‌ను వెనక్కి నెట్టేసి.. గిల్ తొలి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న గిల్.. ఆ స్థానాన్ని ఆక్రమించిన నాలుగవ ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాత్రమే నెంబర్ వన్ బ్యాటర్ స్థానాన్ని ఆక్రమించారు.
A big day for India’s #CWC23 stars with two new No.1 players crowned in the latest @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 😲
Details 👇https://t.co/nRyTqAP48u
— ICC (@ICC) November 8, 2023
వరల్డ్‌కప్‌లో గిల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. శ్రీలంకతో 92, సౌతాఫ్రికాతో 23 రన్స్ చేశాడు. టోర్నీలోని ఆరు మ్యాచుల్లో అతను 219 రన్స్ చేశాడు. వరల్డ్‌కప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన గిల్ 282 రన్స్ చేశాడు. అయితే రెండున్నర ఏళ్లుగా వన్డే టాప్ బ్యాటర్ జాబితాలో ఉన్న బాబర్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రెండో స్థానంలో ఉన్న గిల్ ఆ ప్లేస్‌ను ఆక్రమించేశాడు. బ్యాటర్లలో మూడు పాయింట్లు ముందుకు దూకిన కోహ్లీ.. ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ మూడవ స్థానంలో నిలిచాడు.
బౌలర్లలో సిరాజ్ అగ్ర స్థానంలో నిలిచాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్‌ప్ లో అతను ఇప్పటికే 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు స్థానాల్లో ఇంప్రూవ్ అయిన సిరాజ్.. వన్డేల్లో నెవంబర్ వన్ బౌలర్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ నాలుగవ స్థానంలో ఉన్నాడు. బుమ్రా 8వ, షమీ 10వ స్థానంలో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

