బంతి వికెట్లకు తగిలినా.. అయ్యర్ ఔట్ కాలేదు.. వీడియో
Shreyas Iyer not out; బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున.. ఓ గమ్మత్తు ఘటన జరిగింది. బంగ్లా బౌలర్ వేసిన బంతి వికెట్లకు తగిలినా.. బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఔట్ కాలేదు. ఎందుకంటే ఆ బంతి స్టంప్స్‌ను ఢీకొట్టినా.. వాటిపై
చాటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున.. ఓ గమ్మత్తు ఘటన జరిగింది. బంగ్లా బౌలర్ వేసిన బంతి వికెట్లకు తగిలినా.. బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఔట్ కాలేదు. ఎందుకంటే ఆ బంతి స్టంప్స్‌ను ఢీకొట్టినా.. వాటిపై ఉన్న బెయిల్స్ పడిపోని కారణంగా అతను ఔట్ కాలేదు. ఇన్నింగ్స్ 84వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. పేస్ బౌలర్ ఇబాదత్ హుస్సేన్ వేసిన బాల్.. అయ్యర్‌ను బీట్ చేస్తూ వికెట్లకు తగిలింది. ఆ సమయంలో స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్ కొద్దగా పక్కకు జరిగాయి. కానీ కింద పడలేదు. అప్పుడు అయ్యర్ 77 రన్స్ వద్ద ఆడుతున్నాడు. స్టంప్ లైట్ వెలిగినా.. బెయిల్స్ కింద పడకపోవడం వల్ల అతన్ని నాటౌట్‌గా ప్రకటించారు. ఎంసీసీ 29.1 క్రికెట్ రూల్స్ ప్రకారం బ్యాటర్‌ను నాటౌట్‌గా తేల్చారు. ఆ రూల్ ప్రకారం స్టంప్ కింద పడాలి లేదా కనీసం వికెట్ ఊడిపడిపోతోనే ఔట్‌గా నిర్ధారిస్తారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
An incredible sequence of play in the #BANvIND Test match as @ShreyasIyer15 is bowled by Ebadot Hossain but the 𝗯𝗮𝗶𝗹𝘀 𝗷𝘂𝘀𝘁 𝗿𝗲𝗳𝘂𝘀𝗲 𝘁𝗼 𝗳𝗮𝗹𝗹 🤯
Your reaction on this close 'escape' ❓🤔#SonySportsNetwork #ShreyasIyer pic.twitter.com/q6BXBScVUz
— Sony Sports Network (@SonySportsNetwk) December 14, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

