Hetmyer: హిట్‌మైర్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత
Shimron Hetmyer: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రన్ హిట్‌మైర్‌కు జరిమానా వేశారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ శిక్ష పడింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో హిట్‌మైర్‌కు ఫైన్ పడింది.
చెన్నై: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రన్ హిట్మైర్(Hetmyer)కు జరిమానా వేశారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ శిక్ష పడింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో హిట్‌మైర్‌కు ఫైన్ పడింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 36 రన్స్ తేడాతో నెగ్గింది. ఇంతకీ హిట్‌మైర్‌కు ఎందుకు జరిమానా వేశారన్న విషయాన్ని టోర్నీ నిర్వాహకులు స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ఔటైన తర్వాత హిట్మైర్ ప్రవర్తించిన తీరును ఖండిస్తూ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిషేక్ వర్మ వేసిన బౌలింగ్‌లో హిట్మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఆవేశంలో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టబోయాడు. దాని వల్లే హిట్‌మైర్‌కు జరిమానా వేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్టికల్ 2.2 ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ వన్ నేరానికి హిట్మైర్ పాల్పడినట్లు ప్రకటనలో తెలిపారు.
13.4
W
Abhishek Sharma to Hetmyer, out Bowled!! Hetmyer b Abhishek Sharma 4(10) pic.twitter.com/Y2pcpbeo8K— Misran Ahmad 🏏Shahzadain 🇵🇰 (@MisranAhmad19) May 24, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

