Shikhar Dhawan: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో శిఖర్ ధావన్.. ఆమె ఎవరో తెలిసిపోయింది !
Shikhar Dhawan: శిఖర్ ధావన్ పర్సనల్ లైఫ్‌లో మళ్లీ బిజీ అయ్యాడు. కొత్త అమ్మాయితో అతను కనిపించాడు. దుబాయ్ స్టేడియంలో ఓ విదేశీ మహిళతో ఉన్న అతని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో ఇంటర్నెట్ యూజర్స్ పట్టేశారు.
దుబాయ్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో.. ప్రేక్షకుల గ్యాలరీతో కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు. తన పక్క చైర్లో కూర్చున్న ఆమె ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నది. అయితే ఆమె వివరాలు ఏంటని నెట్ యూజర్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా మహిళకు విడాకులు ఇచ్చిన ధావన్ మళ్లీ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
भारत बांग्लादेश मैच के दौरान वापसी करते शिखर धवन 🤦🏻♂️#ShikarDhawan pic.twitter.com/4HLmFL6biK
— Amoxicillin (@__Amoxicillin_) February 21, 2025
శిఖర్ ధావన్‌తో ఉన్న ఆ మిస్ట్రీ అమ్మాయి పేరును సోఫీ షైన్‌గా గుర్తించారు. ఆమె ఐర్లాండ్ దేశస్థురాలు అని తెలిసింది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ధావన్ ఫాలో అవుతున్నట్లు ఆన్లైన్ యూజర్లు గుర్తించారు. sophieshine93 యూజర్ నేమ్‌తో ఆమె అకౌంట్ ఉన్నది. అయితే సోఫీ ప్రొఫైల్ ప్రైవేట్ కావడం వల్ల ఆమె ఫోటోలు ఎవరికీ లభించడంలేదు. ప్రోడక్ట్ కన్సల్టెంట్‌గా సోఫీ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.
వాస్తవానికి ధావన్, సోఫీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్న అనుమానాలు మాత్రం వ్యాపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ గతంలో ఓ సారి విమానాశ్రయంలో కనిపించారు. ముంబైలో ఆ ఇద్దరూ తమ కారు నుంచి దిగి వెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు వీరిని గుర్తించారు. కానీ అధికారికంగా వాళ్ల రిలేషన్ ఏంటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

