Shakib Al Hasan | కండ్లు మసకబారి బంతి కనిపించలే.. అందుకే వరల్డ్ కప్‌లో విఫలమయ్యా : బంగ్లాదేశ్ కెప్టెన్
Shakib Al Hasan : ఆసియా పులులుగా పేరొందిన బంగ్లాదేశ్ వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో ఘోరంగా విఫలైమంది. అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్ల కంటే దారుణమైన ఆటతో నిరాశపరిచింది. అనుభవజ్ఞుడైన షకీబుల్ హసన్(Shakib Al Hasan) సారథిగా ఉన్నా కూడా సమిష్టి వైఫల్యంతో...
Shakib Al Hasan : ఆసియా పులులుగా పేరొందిన బంగ్లాదేశ్ వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో ఘోరంగా విఫలైమంది. అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్ల కంటే దారుణమైన ఆటతో నిరాశపరిచింది. అనుభవజ్ఞుడైన షకీబుల్ హసన్(Shakib Al Hasan) సారథిగా ఉన్నా కూడా సమిష్టి వైఫల్యంతో అట్టడుగున నిలిచింది. ఈ టోర్నీలో వ్యక్తిగత వైఫల్యంపై హసన్ తొలిసారి స్పందించాడు. ప్రపంచ కప్‌లో తనకు బంతి సరిగా కనిపించలేదని, అందునే పరుగులు సాధించలేకపోయానని షకీబ్ అన్నాడు.
‘భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ టోర్నీ మొత్తం కండ్లు మసకగా కనిపించాయి. దాంతో, బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారి బంతి గమనాన్ని అంచనా వేయడంలో చాలా ఇబ్బంది పడ్డా. టోర్నీ అనంతరం స్వదేశం వెళ్లాక డాక్టర్ని కలిశా.. కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్ నా కార్నియా, రెటీనాలో నీళ్లు ఉన్నట్లు చెప్పాడు.

కళ్లు మునపటిలా బాగా కనిపించేందుకు చుక్కల మందు ఇచ్చాడు. అంతేకాదు ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించాడు’ అని షకీబ్ వెల్లడించాడు. ఆసియా కప్ ముందు వన్డే సారథిగా తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) వైదొలగడంతో సెలెక్టర్లు హసన్‌కు మళ్లీ పగ్గాలు అప్పగించారు. ఆసియా కప్‌లో ఫర్వాలేదనిపించిన షకీబ్ వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశ పరిచాడు.
టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన ఏంజెల్ మాథ్యూస్

ప్రపంచంలోని గొప్ప ఆల్రౌండర్లలో ఒకడపై షకీబ్.. 7 మ్యాచుల్లో 186 పరుగులు చేశాడంతే. అంతేకాదు శ్రీలంకతో మ్యాచ్‌లో ఏంజెల్ మాథ్యూస్ (Angelo Mathews) టైమ్డ్ ఔట్(Timed Out) అప్పీల్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా షకీబ్ ఎడమ చేతివేళ్లకు గాయమైంది. దాంతో, అతడు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వరల్డ్ కప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో రెండు విజయాలకే పరిమితమైన బంగ్లా.. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ 2025 పోటీలకు అర్హత సాధించలేదు.
ఇవి కూడా చదవండి
- Singareni election | భూపాలపల్లిలో సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- Ram Temple: అయోధ్య ప్రాణ ప్రతిష్టకు వెళ్లడం లేదు: సీపీఎం నేత బృందా కారత్
- Sharad Pawar | ప్రధాని అభ్యర్ధిగా తెర పైకి ఖర్గే పేరు : ఇండియా కూటమిలో భగ్గుమన్న విభేదాలు
- MeGa Christmas Celebrations | మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబురాలు…ఫోటో గ్యాలరీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

