దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్‌పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసియాకప్ ఆడటం లేదు. గాయం కారణంగా అతను ఈ టోర్నీకి దూరమయ్యాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సందర్భంగా అఫ్రిదీ మోకాలికి గాయమైంది. దీంతో అతనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని మెడికల్ టీం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే అతను ఆసియా కప్ నుంచి అవుటైనట్లు సమాచారం. భారత్ స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ కూడా గాయాలతో ఆసియా కప్ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అఫ్రిదీ, బుమ్రాలు లేకపోవడంతో చాలామంది బ్యాటర్లు ఊరట చెందుతారని కామెంట్లు చేస్తున్నారు.