DC vs MI : ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) స్టంపౌట్ అయింది. హేలీ మాథ్యూస్ ఓవర్లో సిక్స్ కొట్టిన ఆమె తర్వాతి బంతికి షాట్ ఆడబోయింది. కానీ, ఆమె అంచనా తప్పింది. బంతి అందుకున్న యస్తిక వికెట్లను గిరాటేసింది. మేగ్ లానింగ్ (23), అలిసే క్యాప్సే (1) క్రీజులో ఉన్నారు. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టారు. దాంతో 4 ఓవర్లలోనే ఢిల్లీ 50 పరుగులు చేసింది. ఇసీ వాంగ్ వేసిన రెండో ఓవర్లో షఫాలీ మూడు ఫోర్లు బాదింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన తొలి ఓవర్లో లానింగ్ రెండు బౌండరీలు కొట్టింది. దాంతో, 10 రన్స్ వచ్చాయి.