Asia Cup 2023 | చెలరేగిన బాబర్, షాదాబ్.. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో పాక్ భారీ విజయం
Asia Cup 2023 : వరల్డ్ నంబర్ 1గా ఆసియా కప్‌లో బరిలోకి దిగిన పాకిస్థాన్(Pakistan) అదరగొట్టింది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు భారీ విజయం సాధించింది. బౌలర్లు చెలరేగడంతో పసికూన నేపాల్(Nepal)ను 238 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ 104 వద్దే కుప్పకూలింది. పాక్ ఆల్‌రౌండర్...
Asia Cup 2023 : వరల్డ్ నంబర్ 1గా ఆసియా కప్‌లో బరిలోకి దిగిన పాకిస్థాన్(Pakistan) అదరగొట్టింది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు భారీ విజయం సాధించింది. బౌలర్లు చెలరేగడంతో పసికూన నేపాల్(Nepal)ను 238 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 343 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ 104 వద్దే కుప్పకూలింది. పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan) 4 వికెట్లతో హడలెత్తించాడు. పేసర్లు షాహీన్ ఆఫ్రీదీ, హ్యారిస్ రౌఫ్ రెండేసి వికెట్లతో రాణించారు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ తీసుకుంది. నేపాల్ బౌలర్లను ఉతికారేసిన కెప్టెన్ బాబర్ ఆజం(151 : 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్(109 నాటౌట్ :71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.తో కలిసి 214 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ ఏ దశలోనూ పోరాడలేకపోయింది.
బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్

వంద లోపే సగం వికెట్లు
భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు కుశాల్ బ్రుటెల్(8), ఆసిఫ్ షేక్(5)లను ఆఫ్రీదీ, నసీం షా పెవిలియన్ చేర్చారు. వీళ్లకు తోడూ హ్యారిస్ రౌఫ్ కూడా విజృంభించడంతో 100లోపే నేపాల్ 5 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన జట్టును అరిఫ్ షేక్(26), సొంపల్ కమి(28) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఔటయ్యాక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. షాదాబ్ ఖాన్ తిప్పేయడంతో నేపాల్ 104 పరుగులకే ఆలౌటయ్యింది.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 | దాయాదుల పోరులో కోహ్లీని నిలువరించేది అతడే.. ఆసీస్ మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Cup 2023 | ఫాస్టెస్ట్ సెంచరీ క్లబ్లో పాక్ బ్యాటర్.. మిగతా ముగ్గురు ఎవరంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

