DC vs UPW : యూపీ పేసర్ షబ్నం ఇస్మాయిల్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 7వ ఐదో బంతికి మేగ్ లానింగ్ (39) క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఓవర్ మొదటి బంతికి జెమీమా రోడ్రిగ్స్(3) ను షబ్నం ఇస్మాయిల్ ఎల్బీగా ఔట్ చేసింది. మరినే కాప్, అలిసే క్యాప్సే క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 78 బంతుల్లో 68 రన్స్ కావాలి. 56 రన్స్ వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది. ఓపెనర్ షఫాలీ వర్మ(21) ఔటయ్యింది. సొప్పదండి యషశ్రీ ఓవర్లో లాంగాఫ్‌లో ఎకిల్‌స్టోన్ డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది.