లండన్: నాలుగేండ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ తొలిరౌండ్లో తన వయసు (44 ఏండ్లు) కంటే సగం తక్కువ ఉన్న అమ్మాయితో తలపడనుంది. ఈనెల 29న మొదలయ్యే ఈ టోర్నీలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఆడనున్న సెరెనా.. ఆస్ట్రేలియాకు చెందిన మాయా జాయింట్‌తో ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడుతుంది.
గతంలో ఏడుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా.. రీఎంట్రీలో ఎలా ఆడుతుందని టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింగిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలో ఆమె తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి బరిలోకి దిగనున్నది.