న్యూఢిల్లీ: మహిళల జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో సెన్యామ్ పసిడి పతకం నెగ్గింది. జర్మనీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ మెగాటోర్నీలో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సెన్యామ్ 238 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.
కిమ్ మిన్సె (236; కొరియా), లి హెంగ్ యూ (216; చైనీస్ తైపీ) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.