వ్రిత్తి వండర్
వేసవిలో తల్లిదండ్రులతో కలిసి సరదాగా సమ్మర్ క్యాంప్‌కు వెళ్లిన ఆ అమ్మాయి.. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఈత కొలనులో చేప పిల్లను తలపించిన ఆ ముడి బంగారాన్ని సానబెట్టిన కోచ్ ఆ చిన్నారిని గొప్ప స్విమ్మర్‌గా తీర్చిదిద్దాడు. పదేండ్లు నిండకముందే రాష్ట్ర చాంపియన్‌గా అవతరించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నది.
- ఒలింపిక్ పతకమే లక్ష్యంగా అడుగులు
- స్విమ్మింగ్‌లో రాణిస్తున్న హైదరాబాదీ
వేసవిలో తల్లిదండ్రులతో కలిసి సరదాగా సమ్మర్ క్యాంప్‌కు వెళ్లిన ఆ అమ్మాయి.. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఈత కొలనులో చేప పిల్లను తలపించిన ఆ ముడి బంగారాన్ని సానబెట్టిన కోచ్ ఆ చిన్నారిని గొప్ప స్విమ్మర్‌గా తీర్చిదిద్దాడు. పదేండ్లు నిండకముందే రాష్ట్ర చాంపియన్‌గా అవతరించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నది. ఎప్పటికైనా ఒలింపిక్ మెడల్ సాధించడమే తన లక్ష్యమంటున్న ఆ హైదరాబాదీ స్విమ్మరే వ్రిత్తి అగర్వాల్.
ప్రస్తుతం సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్న 17 ఏండ్ల వ్రిత్తి తన గతి, గమనం, గమ్యం.. నమస్తే తెలంగాణతో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. చిన్నప్పుడు సమ్మర్ క్యాంప్‌లో సరదాగా ఈత కొట్టేదాన్ని. అది గుర్తించిన కోచ్ జాన్ సిద్దిఖీ కాంపిటేటివ్ స్విమ్మింగ్ ఎంచుకునేలా ప్రోత్సహించారు. ఇక అప్పటి నుంచి ఈత కొలనుతో స్నేహం ఏర్పడింది. ప్రాక్టీస్ ప్రారంభించిన కొన్ని రోజులకే జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు రావడం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో ప్రతి టోర్నీలో పాల్గొంటానని చిన్నప్పటి నుంచే మారం చేసేదాన్ని. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఎక్కువ తీరిక ఉండేది కాదు. దీంతో మా అమ్మే నన్ను ప్రతి టోర్నీకి తీసుకెళ్లేది. జూనియర్ స్థాయిలో నిలకడగా రాణించడంతో పాటు స్టేట్ చాంపియన్‌గా నిలువడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

నాలుగేండ్లలోనే నేషనల్ స్థాయికి..
- 2015లో కాంపిటేటివ్ స్విమ్మింగ్ ప్రారంభించిన నేను.. నాలుగేండ్లలో జాతీయ చాంపియన్‌గా నిలిచా. ఈ నాలుగేండ్లు ఎంతో కష్టపడ్డా. ఒకవైపు చదువు, మరోవైపు ప్రాక్టీస్.. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమయ్యేది. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సాహం అందించారు. వారిచ్చిన స్ఫూర్తితోనే ముందుకు సాగా. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 3, జాతీయ స్థాయిలో 36, రాష్ట్ర స్థాయిలో 55 పతకాలు సాధించా.
దక్షిణాఫ్రికాలో 3 రజతాలు..
- నిరుడు పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. అంతర్జాతీయ స్థాయిలో తొలి టోర్నీ కావడంతో ఒత్తిడి ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ, ఒక్కసారి పూల్‌లో అడుగుపెట్టాక అవన్నీ పట్టించుకోలేదు. అంతర్జాతీ స్థాయి స్విమ్మర్లతో పోటీ పడుతూ పతకాలు నెగ్గడం చాలా ఆనందంగా అనిపించింది. 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్లు ఫ్రీస్టయిల్ విభాగాల్లో రజతాలు గెలిచా.
జాతీయ రికార్డు నా పేరిటే..
- జూనియర్ స్థాయిలో నా పేరిట జాతీయ రికార్డు ఉంది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో 9 నిమిషాల 10 సెకన్లలో లక్ష్యాన్ని చేరాను. గతంలో అది 9.14గా ఉండేది. ప్రస్తుతం 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో పోటీపడుతున్నా. బట్టర్ ఫ్లైలో 200 మీటర్లలో మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నా.
నేషనల్ గేమ్స్‌లో 4 పతకాలు..
- 2022 (రాజ్‌కోట్) జాతీయ క్రీడల్లో రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించా. ప్రస్తుతం నా వయసు 17 కావడంతో జూనియర్ విభాగంలో పోటీ పడుతూనే.. సీనియర్ ఈవెంట్స్‌లోనూ పాల్గొంటున్నా. నిరుడు జూనియర్ నేషనల్స్‌లో 3 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచా. ఇదే సమయంలో జాతీయ రికార్డు బద్దలు కొట్టా.
ఒలింపిక్ మెడల్ లక్ష్యం..
- అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధిస్తే వచ్చే సంతోషమే వేరు. విదేశాల్లో జాతీయ జెండా ఎగురుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్గేమ్స్, ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. అమెరికా స్విమ్మర్ కేటీ లెడెక్కీ నా రోల్‌మోడల్. ఆమె తరహాలోనే ఒలింపిక్ స్వర్ణం నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
డైట్ తప్పనిసరి..
- కొలనులో సత్తాచాటాలంటే.. తిండిపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే చిన్నప్పటి నుంచే జంక్‌ఫుడ్‌కు దూరమయ్యా. ప్రతి రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా. ప్రస్తుతం బోరంపేటలో జాన్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నా. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు పూల్‌లో గడపాల్సిందే.
ఖర్చుతో కూడుకున్న పని..
- ఒక్క టోర్నీలో పాల్గొనాలంటే భారీగా ఖర్చు అవుతుంది. రేసింగ్ డ్రెస్, క్యాప్, గాగుల్స్ ఇలా 30 వేల వరకు వెచ్చించా ల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణ ఖర్చులు, భోజన వసతి అదనం. దూర ప్రాంతాల్లో పోటీలకు వెళ్లేందుకు ఆలోచించాల్సి వస్తోంది. స్పాన్సర్స్ ముందుకువస్తే.. మరిన్ని పతకాలు సాధిస్తా.
తెలంగాణలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభిస్తున్నది. ఏ రంగంలోనైనా ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చక్కటి తోడ్పాటు అందిస్తున్నది. ప్రస్తుతం సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నా. ఇందులో రాణిస్తే.. ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించవచ్చు. ము న్ముందు ప్రభుత్వం నుంచి మరింత సహకారం లభిస్తే.. పారిస్ (2024) ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

