రోమ్ : ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్, మహిళల టాప్ ర్యాంకర్ ఇగా సియాటెక్ ప్రిక్వార్టర్ఫైనల్లో ప్రవేశించారు. జొకోవిచ్ మూడు సెట్ల పోరులో 6-3, 4-6, 6-1తో గ్రిగొర్ దిమిత్రివ్ను ఓడించగా, సియాటెక్ 6-2, 6-0తో లెసియా సురెంకొపై సునాయాసంగా గెలుపొందింది.
ఇతర మ్యాచ్‌లలో కామెరాన్ నోరీ 6-2, 7-6(7-4)తో మార్టన్ ఫక్సోవిక్స్పై గెలిచాడు. మహిళల విభాగంలో డొనా వెకిక్ 2-6, 7-6(7-5), 6-2తో లుడ్మిలా శామ్సొనోవాపై, మేరీ బొజ్కోవా 4-6, 6-2, 6-2తో కొకొ గాఫ్‌పై గెలుపొందారు.