హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అదరగొట్టింది. శుక్రవారం అజిజ్నగర్లో జంషెడ్పూర్ ఎఫ్‌సీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో శ్రీనిధి దక్కన్ జట్టు 2-1తో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా(70ని), లూయిస్ ఒగానా(90ని) గోల్స్ చేశారు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో జంషెడ్పూర్ 1-0 ఆధిక్యం కనబర్చగా, శ్రీనిధి అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది. కచ్చితమైన పాస్‌లతో ముందుకు సాగుతూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్స్ నమోదు చేసింది.