రిషబ్ పంత్‌ను వెనకేసుకొచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడన్న వార్తపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. అయితే అతన్ని దాదా వెనకేసుకొచ్చారు. అన్నిసార్లూ మాస్కు ధరించడం సాధ్యం కాదు అని గంగూలీ అనడం విశేషం. అయినా ఇంగ్లండ్‌లో ఇప్పుడు రూల్స్ కూడా మారిపోయాయి. అభిమానులను స్టేడియాలకు అనుమతిస్తున్నారు. మనం యూరో, వింబుల్డన్ చూశాం. పైగా ప్లేయర్స్ లీవ్‌లో ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ మాస్క్‌లు ధరించడం అసాధ్యం అని గంగూలీ అన్నారు.
యూరోలో భాగంగా ఇంగ్లండ్, జర్మనీ మధ్య మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లిన విషయం తెలిసిందే. స్టేడియంలో అతడు మాస్క్ లేకుండానే కనిపించాడు. ఇలాంటి టోర్నీలకు వెళ్లొద్దని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్లేయర్స్‌కు మెయిల్ పంపించారన్న వార్తల నేపథ్యంలో గంగూలీ ఇలా స్పందించడం గమనార్హం. పంత్‌కు పాజిటివ్‌గా తేలగా.. సాహా, అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

