న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ ఖాతా వేసుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరింది. నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత జంట.. ఈ ఏడాది కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, ఇండోనేషియా టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది.