Sanjay Bangar | లియాన్ బౌలింగ్‌లో కోహ్లీ ఈ పొరపాట్లు చేయొద్దు.. ధాటిగా ఆడాలి : మాజీ బ్యాటింగ్ కోచ్
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను ఎదుర్కొనేటప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా షాట్లు ఆడాలని భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదలుకానుంది.
Sanjay Bangar : ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను ఎదుర్కొనేటప్పుడు విరాట్ కోహ్లీ రెండు పొరపాట్లు చేయొద్దని భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో లియాన్ ఓవర్లో ఇబ్బంది పడకుండా ఉడేందుకు కోహ్లీకి ఆయన కొన్ని సూచనలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో బంగర్ మాట్లాడుతూ.. ‘లియాన్ ఓవర్లో కోహ్లీ ఈ రెండు పొరపాట్లు చేయొద్దు. అలాచేస్తే అతను చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఈ స్పిన్నర్ ఓవర్లో దూకుడుగా షాట్లు ఆడాలి. అంతేకాదు అతని బౌలింగ్‌లో విరాట్ కొంచెం లెగ్‌స్టంప్ దిశగా ఉండి ఆడాలి. అప్పుడే స్వీప్ షాట్లు బాగా కొట్టగలడు. దాంతో అతడిని భయపెట్టవచ్చు. అంతేకాదు లియాన్‌కు ఎక్కువ డాట్ బాల్స్ వేసే అవకాశం ఇవ్వకూడదు’ అని తెలిపాడు. మరో నాలుగు రోజుల్లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టు నాగ్‌పూర్‌లో మొదలుకానుంది.
7 సార్లు కోహ్లీ ఔట్
స్వదేశంలో అయినా, విదేశీ టూర్ అయినా ఆసీస్‌పై చెలరేగి ఆడే కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌తో ఫామ్ అందిపుచ్చుకున్న అతను వన్డేల్లో రెండు నెలల వ్యవధిలోనే మూడు శతకాలు బాదాడు. దాంతో, బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌లో అతడి నుంచే ఆస్ట్రేలియాకు ముప్పు ఉంది. దాంతో ఆసీస్ బౌలర్లు అతడిని టార్గెట్ చేస్తారు. అయితే.. లియాన్ రూపంలో కోహ్లీకి అతి పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఇప్పటివరకూ ఈ స్పిన్నర్ 18 టెస్టుల్లో 7 సార్లు కోహ్లీని ఔట్ చేశాడు. అదికూడా భారత గడ్డపై ఆరుసార్లు (2013లో మూడుసార్లు, 2017లో మూడుసార్లు) లియాన్ ఓవర్లో విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

