Sania Mirza Team | షోయబ్‌కు కొన్ని నెలల ముందే విడాకులు.. సానియాకు ఇప్పుడు ప్రైవసీ కావాలి
Sania Mirza Team : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో వివాహం చేసుకోవడంతో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా(Sania Mirza) వ్యక్తిగత జీవితం మరోసారి చర్చకు వచ్చింది. సానియా, మాలిక్‌లు ఎప్పుడు విడాకులు తీసుకున్నారు? వాళ్లు విడిపోవడానికి కారణం ఏంటీ? ఇలా రకరకాలుగా సోషల్‌మీడియాలో...
Sania Mirza Team : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో వివాహం చేసుకోవడంతో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా(Sania Mirza) వ్యక్తిగత జీవితం మరోసారి చర్చకు వచ్చింది. సానియా, మాలిక్‌లు ఎప్పుడు విడాకులు తీసుకున్నారు? వాళ్లు విడిపోవడానికి కారణం ఏంటీ? ఇలా రకరకాలుగా సోషల్‌మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. దాంతో, సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా(Imran Mirza) తన కూతురు.. షరియా చట్టంలోని ఖులా పద్థతిలో ప్రకారం షోయబ్‌కు డైవోర్స్ ఇచ్చేసిందని స్పష్టం చేశాడు.
తాజాగా మాలిక్ మూడో పెండ్లిపై సానియా టీమ్, కుటుంబం స్పందించింది. ‘సానియా తన వ్యక్తిగత జీవితాన్ని ఎల్లప్పుడూ గోప్యంగానే ఉంచింది. ఇప్పుడు ఆమెకు మరింత ప్రైవసీ కావాలి. షోయబ్, సానియాలు కొన్ని నెలల ముందే విడాకులు తీసుకున్నారు. షోయబ్ కొత్త జీవితం బాగుండాలని సానియా విష్ చేసింది.
తన జీవితంలోని సున్నితమైన దశ ఇది. అందుకని ఆమె గోప్యతకు భంగం కలిగించే విధంగా ఎలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని అభిమానులను కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో సానియా కుటుంబం వెల్లడించింది.

షోయబ్ మాలిక్, సానియా మిర్జాలు పెండ్లి 2010లో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వలీమా వేడుక జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు 2018లో ఇజాన్(Izhaan) అనే కుమారుడు పుట్టాడు. అయితే.. గత కొంత కాలంగా వేరువేరుగా ఉంటున్న సానియా, షోయబ్ తమ పన్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు.

సానియా కంటే ముందు మాలిక్ అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)ని 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో అయేషాతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు. ఇప్పుడు షోయబ్ పెండ్లి చేసుకున్న సనా ఒక ఉర్దూ టీవీ సీరియల్ నటి. 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సనాకు ఇది రెండో పెండ్లి. మొదట పాక్ నటుడు, సింగర్ ఉమర్ జస్వాల్‌ను 2020లో పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం సనాకు, షోయబ్‌కు 11 ఏండ్ల వయసు అంతరం ఉంది.
ఇవి కూడా చదవండి
- Australian Open | ఎదురులేని జకోవిచ్.. క్వార్టర్స్‌లో సబలెంక, గాఫ్
- Animal Movie | ఓటీటీలోకి రాబోతున్న ‘యానిమల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- Asaduddin Owaisi | అసదుద్దీన్ త్వరలో రామ నామాన్ని స్మరిస్తారు: వీహెచ్‌పీ నేత వినోద్ బన్సాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

