న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మోచేతి గాయం కారణంగా వచ్చే వారం ఆరంభం కానున్న యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. గత నెలలో కెనడా టోర్నీలో తన మోచేతి నరాలు దెబ్బతిన్నాయని, మంగళవారం స్కానింగ్ నివేదిక అందిన తరువాత యూఎస్ ఓపెన్‌నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు సానియా వెల్లడించింది.
ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన మీర్జా ఈ సీజన్‌తో రిటైర్మెంట్ కావాలని యోచించింది. అయితే గాయం కారణంగా తన రిటైర్మెంట్పై పునఃనిర్ణయం తీసుకోవాలని ఆమె యోచిస్తున్నది.