సానియా పోరాటం ముగిసె
కెరీర్లో చివరిసారి వింబుల్డన్ బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు ఆల్‌ఇంగ్లండ్ క్లబ్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించలేకపోయిన సానియా.. ఈ సారైనా తన కల నెరవేర్చుకోవాలనుకుంటే.. ఆ ఆశ తీరలేదు.
వింబుల్డన్: కెరీర్లో చివరిసారి వింబుల్డన్ బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు ఆల్‌ఇంగ్లండ్ క్లబ్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించలేకపోయిన సానియా.. ఈ సారైనా తన కల నెరవేర్చుకోవాలనుకుంటే.. ఆ ఆశ తీరలేదు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సానియా-పావిచ్ (క్రొయేషియా) జోడీ 6-4, 5-7, 4-6తో టాప్ సీడ్ నీల్ (బ్రిటన్)-క్రాజిక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
గంటా 16 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ నెగ్గిన సానియా జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో ప్రభావం చూపలేకపోయింది. కెరీర్లో ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న సానియా మీర్జా.. మిక్స్డ్ డబుల్స్‌లో మూడు (2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2014 యూఎస్ ఓపెన్) ట్రోఫీలు ఖాతాలో వేసుకుంది. ఈ సారి వింబుల్డన్ కూడా చేజిక్కించుకోవాలనుకున్న హైదరాబాదీకి సెమీస్‌లో చుక్కెదురైంది. ఈ సీజన్ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

