RCB vs RR : అహ్మదాబాద్ పిచ్‌పై రాజస్థాన్ కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(45)ను గ్రీన్ ఔట్ చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (17) స్టంపౌట్ అయ్యాడు. కరన్ శర్మ వేసిన 11వ ఓవర్ మొదటి బంతికి ఫ్రంట్ ఫుట్ వచ్చిన శాంసన్ బంతిని మిస్ అయ్యాడు.
అంతే రెప్పపాటులో కీపర్ దినేవ్ కార్తిక్ స్టంపౌట్ చేశాడు. దాంతో, 86 వద్ద రాజస్థాన్ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం రియాన్ పరాగ్(8), ధ్రువ్ జురెల్(7)లు ఆచితూచి ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 100/3. ఇంకా విజయానికి 48 బంతుల్లో 73 పరుగులు కావాలి.
𝗗𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝗱! 🫣
Captain Sanju Samson is stumped off a wide delivery ☝️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/e0G6MhVu18
— IndianPremierLeague (@IPL) May 22, 2024