Sanju Samson : లార్డ్స్ శతకంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంజూ శాంసన్ (Sanju Samson) సారీ చెప్పాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో తనకు అవకాశం లభిస్తుందని రోహిత్ చెప్పినా.. తాను నమ్మలేదని శాంసన్ తెలిపాడు. ‘స్వదేశంలో ముగిసిన పొట్టి ప్రపంచప్ సమయంలో నేను రోహిత్‌ను నమ్మలేదు. అందుకు ఇప్పుడు సారీ’ అని మంగళవారం శాంసన్ పేర్కొన్నాడు. అంతేకాదు మెగా ఈవెంట్లో తనను తాను ఆత్మవిమర్శ చేసుకున్న తీరును సంజూ వెల్లడించాడు.
స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో బెంచ్‌మీదే కూర్చున్న సంజూ శాంసన్.. నాకౌట్లో చెలరేగాడు. తనకిచ్చిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకొని.. వరసగా అర్ధ శతకాలతో టీమిండియా విజయాల్లో కీలకమయ్యాడు. అయితే.. న్యూజిలాండ్‌పై విఫలమైనందున టోర్నీ ప్రపంచకప్ జరుగుతుండగా ‘అసలు నేను తుది జట్టులో ఉంటానా? ఉండనా?’ అనే సందేహం అతడిని వెంటాడిందట. అప్పుడు.. రోహిత్ శర్మ అతడితో ‘సంజూ.. నీకు పక్కాగా అవకాశం వస్తుంది. దిగులు చెందకు’ అని చెప్పాడని శాంసన్ తాజాగా వెల్లడించాడు.
“Didn’t Believe Him, Sorry”: Sanju Samson On Rohit Sharma’s T20 World Cup Remarkhttps://t.co/C3CbzEfVlk pic.twitter.com/WRJq8ktU2e
— NDTV Sports (@Sports_NDTV) July 21, 2026
‘నేను నిజాయతీగా చెబుతున్నా.. అప్పుడు రోహిత్‌ను నమ్మలేదు. సారీ. అతడు హృదయపూర్వంగా లేదా తన అనుభవంతో ఆ మాట చెప్పి ఉండవచ్చు. కానీ, ఆరోజు అతడికి నాపై ఉన్న నమ్మకం నాకు లేదు. ఆరోజు నేను అతడి మాటల్ని నమ్మే పరిస్థితిలో లేను. ఎందుకంటే.. న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్ ముగిసినర రెండు రోజులకే వరల్డ్‌కప్ మొదలైంది. దాంతో.. నాకు మెగా టోర్నీకి సిద్ధమయ్యేందుకు దాదాపు వారం పట్టింది. అంటే.. నేను అప్పటికి సిద్ధంగా లేనని నా ముఖంలో 100 శాతం కనిపించేది. ఐదారు రోజులు నేను అదే విధమైన నిరాశలో ఉండిపోయాను. ఆ సమయంలో నాకు నేను ధైరయం చెప్పుకున్నా.
Virat Kohli scored 89 off 47 balls vs West Indies in 2016.
Sanju Samson made 89 off 42 balls vs England in 2026.
These are the joint-highest individual scores by an Indian in the knockout stage of the ICC Men’s T20 World Cup.
— Cricketopia (@CricketopiaCom) March 5, 2026
నీకు తెలుసా నువ్వు విఫలమయ్యావు. తర్వాత ఏంటీ? నువ్వు అట్టడుగున ఉన్నావు. ఇక్కడి నుంచి పైకి మాత్రమే వెళ్లగలవకు. కాబట్టి.. మానసికంగా సన్నద్ధమవ్వు. నేను క్రికెట్ ఎందుకు ఆడుతున్నాను? నా లక్ష్యం ఏంటీ?.. ఇలా వరల్డ్‌కప్ సమయంలో నన్ను నేను విశ్లేషించుకున్నా. అలా నన్ను నేను ప్రశ్నించుకున్నాక అంతా మారిపోయింది. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాను’ అని శాంసన్ వెల్లడించాడు.

టీ20 వరల్డ్‌కప్ నాకౌట్లో రెచ్చిపోయిన శాంసన్ వెస్టిండీస్‌పై 97 నాటౌట్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లోనూ న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89 రన్స్ చేశాడు. టీమిండియా మూడోసారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడంతో.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు శాంససన్.