DC vs CSK | ఢిల్లీ కోటలో చెలరేగిన శాంసన్, కార్తిక్.. ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై..!
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజయంతో రేసులోకొచ్చింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సీఎస్కే.. ఢిల్లీ క్యాపిట్స్‌ను అలవోకగా మట్టికరిపించింది.
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజయంతో రేసులోకొచ్చింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సీఎస్కే అలవోకగా ఢిల్లీ క్యాపిట్స్‌ను మట్టికరిపించింది. 156 పరుగులు ఛేదనలో సంజూ శాంసన్(87 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. కార్తిక్ శర్మ(41 నాటౌట్) మెరుపులతో జయభేరి మోగించింది. ఐదో విజయంతో నాకౌట్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది చెన్నై. దాంతో, సొంతగడ్డపై గెలిచి పది పాయింట్లు సాధించాలనుకున్న ఢిల్లీకి చుక్కెదురైంది.
ఐపీఎల్ -19 లీగ్ దశలో ఆలస్యంగా పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయం నమోదు చేసింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తగా ఓడించింది. తొలుత బౌలర్ల కృషితో ఆతిథ్య జట్టును పరిమితం చేసిన సీఎస్కే.. ఛేదనలో త్వరగానే రెండు వికెట్ల పడినా ఒత్తిడికి లోనవ్వలేదు. శాంసన్(87 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీకి, కార్తిక్ శర్మ(41 నాటౌట్) సహకారం తోడవ్వగా వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది.
Moving step by step closer to the W! 🎯
Sanju Samson 🤝 Kartik Sharma 💛
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/MoCXAPFl6Q
— IndianPremierLeague (@IPL) May 5, 2026
ఛేదనలో ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్(6)ను ఎంగిడి ఔట్ చేసి షాకిచ్చినా.. ఉర్విల్ పటేల్(17) రెండు సిక్సర్లతో ప్రమాదకరంగా కనిపించాడు. కానీ, అతడిని అక్షర్ వెనక్కి పంపగా సంజూ శాంసన్(87), కార్తిక్ శర్మ(41 నాటౌట్)లు నింపాదిగా ఆడుతూ.. పదో ఓవర్ నుంచి గేర్ మార్చారు. కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో 6, 6, 4 బాదిన సంజూ 32 బంతుల్లోనే ఆర్ధ శతకం అందుకున్నాడు. అనంతరం స్టార్క్‌ను ఉతికేస్తూ రెండు ఫోర్లు కొట్టడంతో చెన్నై స్కోర్ వంద దాటింది. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన సంజూ .. నటరాజన్ ఓవర్లో వరుసగా 6, 6, 4 తో విజయాన్ని మరింత తేలిక చేశాడు. 18వ ఓవర్లో కార్తిక్ వరసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో చెన్నై 8 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది.
A Sanju Samson alert that no bowler wants to see 🫣😬
🎥 @ChennaiIPL‘s man in form is in the groove 😎
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @IamSanjuSamson pic.twitter.com/jM0XAnVoLA
— IndianPremierLeague (@IPL) May 5, 2026
ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఆర్సీబీపై 75 పరుగులకే ఆలౌట్ నుంచి పాఠాలు నేర్వకపోవడం ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లో పడేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 69కే ఐదు వికెట్లు పడిన వేళ ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(40 నాటౌట్), స్టబ్స్(38) ఆదుకున్నారు. ఆఖర్లో అశుతోష్ శర్మ(14) రెండు సిక్సర్లతో స్కోర్ దాటించాడు. చివరి బంతికి రిజ్వీ సిక్సర్ బాదగా ఢిల్లీ ప్రత్యర్థికి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
స్టబ్స్(38), సమీర్ రిజ్వీ(40 నాటౌట్)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

