DC vs MI : పంతొమ్మిదో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయంతో మురిసింది. సొంత మైదానంలో రిజ్వీ దూకుడు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్లు తేలిపోగా.. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్‌మనిపించింది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని రిజ్వీ ఓపెనర్ పథుమ్ నిశాంక(44)తో కలిసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ హిట్టర్‌కు డేవిడ్ మిల్లర్(21 నాటౌట్) మెరుపులు తోడవ్వగా.. 18.1 ఓవరల్లోనే మ్యాచ్‌ను ముగించింది ఢిల్లీ.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్లు విజయదుంధుబి మోగిస్తున్నాయి. తమ సొంత ఇలాకాఆరుణ్ జైట్లీ స్టేడియంలో పంజా విసిరిన ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ప్రత్యర్ధిని 163కే కట్టడి చేసింది ఢిల్లీ.
A sweet homecoming 🏠
Axar Patel-led @DelhiCapitals make it 2⃣ wins in 2⃣ with a commanding six-wicket victory in Delhi 👏🔝
Scorecard ▶️ https://t.co/lufWYIGWql#TATAIPL | #KhelBindaas | #DCvMI pic.twitter.com/0I3mgme3bL
— IndianPremierLeague (@IPL) April 4, 2026
ఛేదనలోఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడగా.. మోస్తరు లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ పథుమ్ నిశాంక(44) రాణించగా.. డేవిడ్ మిల్లర్(21 నాటౌట్) తన స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన అక్షర్ పటేల్ సేన.. నాలుగు పాయింట్లు సాధించింది.
తొలి మ్యాచ్‌లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఢిల్లీలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆతిథ్య జట్టు ఆరంభంలోనే షాకిచ్చింది. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ విజృంభణతో 18 పరుగులకే రియాన్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లు పెవిలియన్ చేరారు. ఆ దశలో రోహిత్ శర్మ(35)తో కలిసి ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్(51) ఆదుకున్నాడు. ఆఖర్లో నమన్ ధిర్(28), మిచెల్ శాంట్నర్(18 నాటౌట్)లు బ్యాట్ ఝులిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో పరుగులు చేసింది.