ఢాకా: ఆఫ్‌స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/35) కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్ పట్టు బిగించింది. భారీ వర్షం కారణంగా రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన ఈ మ్యాచ్‌లో.. ఫలితం రాబట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నది. ఓవర్‌నైట్ స్కోరు 188/2తో మంగళవారం ఆట కొనసాగించిన పాక్.. 300/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (76), అజహర్ అలీ (56), రిజ్వాన్ (53 నాటౌట్), ఫవద్ ఆలమ్ (50 నాటౌట్) అర్ధశతకాలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నజ్ముల్ హసన్ (30) టాప్‌స్కోరర్. బుధవారం ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 3 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 224 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ప్రమాదం అంచున ఉంది.