Arjun Tendulkar | ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్.. గోవా జట్టు తరఫున బరిలోకి
23 ఏళ్ల వయసున్న అర్జున్ ఎడమ చేతివాటం బౌలర్
Arjun Tendulkar : టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న తన కలను నిజం చేసుకున్నాడు. గోవా జట్టు తరఫున అతను మంగళవారం రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. పొర్వోరిమ్ స్టేడియంలో రాజస్థాన్‌తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ సీ మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతను తుది జట్టులో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసున్న అర్జున్ ఎడమ చేతివాటం బౌలర్. తండ్రిలాగా రంజీల్లో ముంబై జట్టు తరఫున ఆడాలని అర్జున్ కలలు కన్నాడు. కానీ, పోటీ ఎక్కువ ఉడడంతో చోటు దొరకడం కష్టమైంది. దాంతో ఈ ఏడాది ప్రారంభంలో అతను గోవాకు మకాం మార్చాడు.
పోయిన ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ను కనీస ధరకు సొంతం చేసుకుంది. అయితే, అతడిని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. అర్జున్ నెట్ ప్రాక్టీస్ వరకే పరిమితం అయ్యాడు. ‘తుది జట్టులో చోటు సంపాదించాలంటే అర్జున్ కొన్ని విషయాల్లో మరింత మెరుగవ్వాలి’ అని స్వయంగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే చెప్పడం విశేషం. ఫస్ట్‌క్లాస్ ఎంట్రీకి ముందు అర్జున్ మహారాష్ట్ర, గోవా తరఫున 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు మాత్రమే ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

