Sachin Tendulkar : పొట్టి క్రికెట్లో నంబర్ 1 అయిన భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్టార్ క్రికెటర్ కళ్లు చెదిరే షాట్లతో, విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. దాంతో, పిల్లల నుంచి యువ క్రికెటర్ల వరకు చాలామంది అతనిలా ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా మూమల్ మెహర్ అనే 14 ఏళ్ల అమ్మాయి అచ్చం సూర్యకుమార్‌లా షాట్లు ఆడుతున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఆ బాలికను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
‘నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది. ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది. ఎంత విశేషం. నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను’ అని లిటిల్ మాస్టర్ ట్వీట్టర్లో కామెంట్ చేశాడు. రాజస్థాన్‌లోని బర్మార్‌కు చెందిన ఈ విద్యార్థిని బ్యాటింగ్ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మూముల్ వీడియో చూసిన ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ కూడా స్పందించింది. మూముల్ ప్రతిభను గుర్తించి, పోత్రహించాలి. దాంతో, ఆమెకు ట్రైనింగ్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అని స్వాతి అంది.
పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లోనూ అతను తన ఫామ్ కొనసాగించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో సూర్య శతకంతో చెలరేగాడు. స్వదేశంలో శ్రీలంకపై కూడా సెంచరీ కొట్టాడు. ఈ విధ్వంసక ప్లేయర్ ఇప్పటికే టీ20ల్లో మూడు సెంచరీలు బాదాడు. దాంతో, అతడికి టెస్టు జట్టు నుంచి పిలువు వచ్చింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. నాగ్‌పూర్ టెస్టులో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023