అబుధాబి: సఫారీ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్మెన్ విలవిల్లాడుతున్నారు. ఆరంభంలోనే సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ తన పదునైన బంతులతో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించాడు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు కూల్చి బంగ్లా భరతం పట్టాడు. అతని ప్రదర్శన చూసిన తర్వాత మిగిలిన సఫారీ బౌలర్లు కూడా చెలరేగారు.
దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 56/6తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. క్రీజులో మెహదీ హసన్ (9 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (6 నాటౌట్) ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తబ్రయిజ్ షంసీ, డ్వెయిన్ ప్రిటోరియస్, ఆన్రిచ్ నార్ట్జీ తలో వికెట్ తీశారు.