SA vs BAN | వరుస బంతుల్లో వికెట్లు కూల్చిన రబాడ.. 6 ఓవర్లకు బంగ్లా స్కోరు ఎంతంటే
SA vs BAN | పేసర్ రబాడ అద్భుతమైన బంతులతో కీలక వికెట్లు కూల్చడంతో బంగ్లాదేశ్ జట్టు తడబడింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 30వ మ్యాచ్‌లో

అబుధాబి: పేసర్ రబాడ అద్భుతమైన బంతులతో కీలక వికెట్లు కూల్చడంతో బంగ్లాదేశ్ జట్టు తడబడింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 30వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆల్‌రౌండర షకీబల్ హసన్ లేకుండా బంగ్లా జట్టు బరిలో దిగింది.
ఈ క్రమంలో ఆచితూచి ఆడుతున్న బంగ్లా ఓపెనర్లకు పేసర్ రబాడ చెక్ పెట్టాడు. నాలుగో ఓవర్ వేసిన అతను చివరి రెండు బంతులకు రెండు వికెట్లు కూల్చాడు. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మొహమ్మద్ నైమ్ (9).. హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ మరుసటి బంతికే మాజీ ఓపెనర్ సౌమ్య సర్కార్ (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు.
ఆడిన తొలిబంతికే అతను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మళ్లీ ఆరో ఓవర్లో రబాడ చేతికి బంతి చేరింది. ఆ ఓవర్ తొలి బంతికి వికెట్ తీస్తే అతని పేరిట హ్యాట్రిక్ చేరేది. కానీ అది మిస్సయినా మూడో బంతికే ఫామ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ (0)ను పెవిలియన్ చేర్చిన రబాడ.. సౌతాఫ్రికా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నందించాడు. అతని ధాటికి ఏ కోశానా కోలుకోలేకపోయిన బంగ్లాదేశ్ తొలి పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి 28/3తో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

