అబుధాబి: బౌలర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చెమటోడుస్తున్నారు. లక్ష్యం చిన్నదే అయినా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందా జట్టు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది.
స్వల్ప లక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన సఫారీలకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4)ను తస్కిన్ అహ్మద్ ఎల్బీగా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన సీనియర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీ కాక్ (16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
హెండ్రిక్స్‌ను అవుట్ చేసిన తస్కిన్ మరోసారి ఆరో ఓవర్లో సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ (0)ను అవుట్ చేశాడు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా జట్టు 33/3తో నిలిచింది.