Asian Games: కెప్టెన్‌గా రుతురాజ్.. కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
Asian Games: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆసియాడ్‌కు బయలుదేరి వెళ్లింది. చైనాలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ క్వార్టర్స్ స్టేజ్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనున్నది.
న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో( Asian Games) పాల్గోనే భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. ఆ జట్టుకు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. రుతురాజ్ నేతృత్వంలోని భారత బృందం.. హంగ్జూకు బయలుదేరి వెళ్లింది. ఆసియా క్రీడల్లో మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇక పురుపుల క్రికెట్ మ్యాచ్‌ల్లో భారత్ ప్రస్థానం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. క్వార్టర్ ఫైనల్స్ స్టేజ్ నుంచి ఇండియా ఎంట్రీ ఉంటుంది. ఇవాళ సాయంత్రం వరకు ఇండియన్ జట్టు చైనాకు చేరుకోనున్నది. రేపటి నుంచి ఆ జట్టు ప్రాక్టీసు మొదలుపెడుతుంది. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్‌లు ఆడారు. ఆసియా క్రీడల్లో సీడింగ్ ప్రకారం .. భారత్ తన తొలి మ్యాచ్‌ను క్వార్టర్స్ స్టేజ్ నుంచి ఆడనున్నది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి.
The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM
— BCCI (@BCCI) September 28, 2023
భారత్ జట్టు బృందం..
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

