IPL 2023 | అర్ధ శతకంతో చెన్నైని ఆదుకున్న గైక్వాడ్.. గుజరాత్ ముందు మోస్తరు టార్గెట్
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ క్వాలిఫైయర్ 1 గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 : 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(40) ఫర్వాలేదనిపించాడు. దాంతో, చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ క్వాలిఫైయర్ 1 గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 : 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(40) ఫర్వాలేదనిపించాడు. దాంతో, చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. షమీ వేసిన 20వ ఓవర్లో రవీంద్ర జడేజా(22) తొలి బంతికి బౌండరీ కొట్టాడు. మూడో బంతికి మోయిన్ అలీ(9 నాటౌట్) మిడ్ వికెట్లో సిక్స్ కొట్టాడు. ఫ్రీ హిట్‌కు సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన జడేజా బౌల్డ్ అయ్యాడు. దాంతో, చెన్నై 172 పరుగులకు పరిమితమైంది.
కీలక మ్యాచ్‌లో సిక్సర్ల శివం దూబే(1), అజింక్యా రహానే(17), అంబటి రాయుడు(17), ఎంఎస్ ధోనీ(1) దారుణంగా విఫలమయ్యారు. వీళ్లు వెంట వెంటనే ఔట్ కావడంతో చెన్నై స్కోర్ వేగం తగ్గింది. ఆఖర్లో రవీంద్ర జడేజా(22) దంచడంతో చెన్నై పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, షమీ రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

