ఎలిమినేటర్‌లో అద్భుత శతకంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదుకున్న రజత్ పటీదార్ (58) పెవిలియన్ చేరాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. 16వ ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన అతను.. తర్వాతి బంతిని స్ట్రెయిట్ సిక్సర్ పంపేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్.. బౌండరీ లైన్ సమీపంలో పూర్తి కంట్రోల్‌తో క్యాచ్ పట్టేయడంతో పటీదార్ పెవిలియన్ చేరాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.